సంక్షేమ ప్రదాత.. రైతు బాంధవుడు..పేదల దేవుడు.. ఆర్యోగ‘సిరి’ కల్పించిన మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు. భౌతికంగా దూరమై 17 సంవత్సరాలు గడిచినా రాజన్నా..నిన్ను మరువలేం అంటూ బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. మహానేత విగ్రహాలకు వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జలాభిషేకాలు చేసి అప్పటి పాలనను గుర్తు చేసుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కులమతాలకు అతీతంగా కలిగిన లబ్ధిని స్మరించుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలను హోరెత్తించారు. పేదలకు దుస్తులు అందించి, అన్నదానం చేసి, రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేసి, రక్తదానం నిర్వహించి అభిమానం చాటుకున్నారు.
● కర్నూలులో మహానేత విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో అభిషేకం చేశారు. వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టా రేణుక, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య పాల్గొన్నారు.
● కల్లూరు శరీన్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి హంద్రీ– నీవా జలాలతో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి జలాభిషేకం చేశారు. రాయలసీమకు కృష్ణాజలాలు తీసుకొచ్చిన మహానేతను రైతులు ఎప్పటికీ మరువబోరన్నారు.
● ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.
● వెల్దుర్తిలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాఽథ్‌రెడ్డి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● బనగానపల్లిలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వారి పురోగతికి వైఎస్సార్ దోహదపడ్డారన్నారు.
● ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. నల్లకాల్వ వద్ద ఉన్న స్పృతివనంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
–కర్నూలు (టౌన్)/ బొమ్మలసత్రం


