కర్నూలు(టౌన్): మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, విజయమనో హరి దంపతుల కుమారుడు జనక్‌దత్తారెడ్డి, శ్రీయల వివాహ రిసెప్షన్‌కు మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం బెంగళూరు నుంచి బయలు దేరి 11.40 గంటలకు ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 12 గంటలకు సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ కళాశాలలో ఏర్పా టు చేసిన రిసెప్షన్‌కు హాజరవుతారు. నూతన వధువరూలను ఆశీర్వదించి 20 నిముషాలు అక్కడే ఉంటారు. అనంతరం 12.35 గంటలకు తిరిగి బెంగళూరుకు బయలుదేరి వెళతారు. కాగా రిసెప్షన్‌కు పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మా జీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరవుతున్నారు.
మెగా డీఎస్సీ టీచర్ విద్యార్హతలపై విచారణ
కర్నూలు(సిటీ): మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎస్‌జీటీ టీచర్ విద్యార్హతలపై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్‌లో ఎస్‌జీటీ టీచర్‌గా ఈడిగ ప్రభాకర్ పనిచేస్తున్నారు. ఈయన మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటాలో ఎస్‌జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. ఈయన విద్యార్హతలపై అనేక ఆరోపణలు విస్తృత ప్రచారం కావడంతో డీఈఓ ఎల్.సుధాకర్ విచారణ చేపట్టారు. కర్నూలు డిప్యుటీ డీఈఓ శ్రీధర్ బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజకుమారి ప్రభాకర్ సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆ సందర్భంగా ఈడిగ ప్రభాకర్ టెట్ అర్హత పొందలేదని అంగీకరించారు. విచారణ నివేదికను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు పంపించనున్నట్లు డీఈఓ వెల్లడించారు.
విద్యుత్ శాఖ ఎస్‌ఈగా శ్రీనివాసరెడ్డి
నంద్యాల(అర్బన్): ఏపీఎస్పీడీసీఎల్ నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈగా(సూపరింటెండెంట్ ఇంజనీర్) శ్రీనివాసరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. స్థానిక కార్యాలయంలో ఈఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి పదోన్నతిపై ఎస్‌ఈగా బాధ్యతలు తీసుకున్నారు. ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కుమార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా తిరుపతికి పదోన్నతిపై వెళ్లారు. ఎస్‌ఈగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డిని ఏపీపవర్ డిప్లొమా ఇంజినీరింగ్ అసోసియేషన్ సర్కిల్ సెక్రటరీ రామయ్య, ప్రెసిడెంట్ జ్ఞానసూర్యుడు, డీ–1 ఏఈ నాగరాజు, చంద్రశేఖర్, తదితరులు కలిసి అభినందనలు తెలిపారు


