రాయలసీమపై చంద్రబాబు వివక్ష | - | Sakshi
Sakshi News home page

రాయలసీమపై చంద్రబాబు వివక్ష

Sep 3 2026 8:53 AM | Updated on Sep 3 2026 8:53 AM

కర్నూలు: రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వివక్ష చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ నంద్యాల,కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాట సాని రాంభూపాల్‌ రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూ లు పార్లమెంటు ఇన్‌చార్జి బుట్టా రేణుక, మాజీ మేయర్‌ బీవై రామయ్య విమర్శించారు. కర్నూలు లో శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని వైసీపీ నేతలు బుధవారం సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా కర్నూలు న్యాయవాదులు హైకోర్టు ఏర్పాటుకు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తించి ప్రకటన చేస్తే సుప్రీం కోర్టులో కేసులు వేయించిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌, వైసీపీ కురువ సంఘం రాష్ట్ర నాయకులు గడ్డం రామకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సిట్రా సత్యనారాయణమ్మ, లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సువర్ణా రెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.

హామీని నెరవేర్చాలని కోరుతూ..

రాయలసీమ ప్రాంతం కోసం ఏపీ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ జిల్లా కోర్టు బయట 50 మందికి పైగా మహిళా న్యాయవాదులు బుధవారం రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు వారికి పూలమాలలు అందించి అభినందించారు. బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్‌ న్యాయవాది నాగలక్ష్మి దేవి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement