పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరును జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనూంజయ, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహం, సాగు నీటి పరిస్థితులు, రైతులకు అందుతున్న నీటి సరఫరాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సాగు నీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందని, జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ కాల్వలకు 4 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ శంకర్‌రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం రెడ్డి, డీఈ నగేష్, జేఈ దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


