ఎత్తిపోతల నీరు వృథా | - | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల నీరు వృథా

Aug 29 2026 1:52 AM | Updated on Aug 29 2026 1:52 AM

కొత్తపల్లి: ఎత్తిపోతల అధికారులు, కమిటీ సభ్యుల నిర్వహణ లోపంతో ఎత్తిపోతల నీరు వృథాగా పారుతుంది. మండలంలోని సింగరాజుపల్లె గ్రామ పొలిమేరలోని వ్యవసాయ పొలాల్లో శుక్రవారం సంగమేశ్వరం – శివపురం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ ఎయిర్‌ వాల్‌ బ్లాస్ట్‌ అయింది. ఉవ్వెత్తున పైప్‌లైన్‌ నుంచి నీరు ఎగసి పడుతోంది. దీంతో సాగునీరు పక్కన ఉన్న మొక్కజొన్న, వరి పొలాలను ముంచెత్తోంది. నీటి వృథా అరికట్టేందుకు రైతులు శ్రమించిన ఫలితం లేకపోయింది. పక్కనే ఉన్న మొక్కజొన్న పొలంలో పంటచేతికి వచ్చే సమయంలో నీరు ముంచెత్తడంతో నష్టపోతున్నామని మహిళా ప్రేమిలమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement