గ్రూప్–1లో నంద్యాల మహిళ జయకేతనం
నంద్యాల(న్యూటౌన్): గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ చూపి నంద్యాల ఎన్జీవో కాలనీకి చెందిన మౌనిక ఎంపిడిఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బీటెక్ పూర్తయిన తర్వాత ఈమె ఎంబీఏ చదివారు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఐదుసార్లు స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు అందుకునఆనరు. కొంత కాలం పోస్టల్ శాఖలో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖలో పనిచేస్తూ ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధం అయ్యారు. పరీక్షలో విజేతగా నిలవడానికి బెంగళూరులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌గా పనిచేస్తున్న తన భర్త కృష్ణకాంత రెడ్డి, తల్లిదండ్రులు లక్ష్మీమోహన్ రెడ్డి, సౌజన్య కుమారిల ప్రోత్సాహం కారణమని మౌనిక తెలిపారు.


