మంచాలమ్మా.. దీవించమ్మా!
మంత్రాలయం: మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గ్రామ దేవత మంచాలమ్మను ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రంలోని మండ్యాలో తయారు చేయించిన బెల్లం అచ్చులు, చెరకు గడలు, గడ్డితో ఆదివారం అలకరించారు. విశేష పూజలు చేశారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం మహాద్వారం నుంచి ‘మంచాలమ్మా.. దీవించమ్మా’ అంటూ భక్తులు దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేసి, మహా మంగళ హారతి చేశారు. బళ్లారి జిల్లా తెక్కల కోటకు చెందిన ఏడు వందల మంది భక్తులు కాలి నడకతో 120 కిలో మీటర్లు దూరం నుంచి రాఘవేంద్ర స్వామి మఠం చేరుకున్నారు.


