సీమ ద్రోహి చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

సీమ ద్రోహి చంద్రబాబు

Feb 2 2026 7:15 AM | Updated on Feb 2 2026 7:15 AM

సీమ ద్రోహి చంద్రబాబు

సీమ ద్రోహి చంద్రబాబు

నందికొట్కూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అడ్డుకున్న సీఎం చంద్రబాబు నాయుడు సీమ ద్రోహిగా నిలిచారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పునఃప్రారంభించాలని ఈనెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఆదివారం కాటసానితో పాటు పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా తదితరులు పరిశీలించారు. అంతుకు ముందు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాటసాని మాట్లాడారు. ‘రాయలసీమ రైతులను ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో 2022లో ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు 80 శాతంపైగానే పూర్తయ్యాయి. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. గుంటూరులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం. ఆ ఫ్లెక్సీని తొలగించాలని కోరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం పిరికిపంద చర్య. పోతిరెడ్డిపాటు వద్ద ఈ నెల 5న జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా మాట్లాడుతూ.. సిట్‌ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా తిరుమల లడ్డూలో కల్తీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఆ ఫ్లెక్సీ కట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా, దానిని తొలగించాలని కోరిన అంబటిపై దాడి చేయడం సిగ్గు చేట న్నారు. సమావేశంలో జెడ్పీటీసీలు సోమల సుధాకర్‌రెడ్డి, జగదీశ్వరెడ్డి, యుగంధర్‌రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, ముస్లిం మైనార్టీ సెల్‌ కార్యదర్శి అబ్దుల్‌ జబ్బార్‌, పట్టణ అధ్యక్షులు మన్సూర్‌, నాయకులు శివరామకృష్ణారెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, లోకేష్‌రెడ్డి, తులసిరెడ్డి, రమణ, గోపాల్‌రెడ్డి, వెంకటేష్‌, మాధురి పాల్గొన్నారు.

రైతు శంఖారావం సభకు తరలిరండి!

జూపాడుబంగ్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న రైతు శంఖారావం సభకు తరలిరావాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్రకిషోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాతో కలసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. వారి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి, అధికార ప్రతినిఽధి నాగార్జునరెడ్డి, మండల కన్వీనర్‌ తోకల కృష్ణారెడ్డి, తరుణ్‌కుమార్‌రెడ్డి, వెంకటరమణ పాల్గొన్నారు.

బాబు పాలనలో రాష్ట్రం అధోగతి

డైవర్షన్‌ రాజకీయాల్లోనే

ఫ్లెక్సీ వివాదం

5న పోతిరెడ్డిపాడు సభను

విజయవంతం చేయండి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు

కాటసాని రాంభూల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement