గ్రూప్‌–1, గ్రూప్‌–2 విజేతలుగా అక్క, చెల్లెలు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1, గ్రూప్‌–2 విజేతలుగా అక్క, చెల్లెలు

Feb 1 2026 3:41 AM | Updated on Feb 1 2026 3:41 AM

గ్రూప

గ్రూప్‌–1, గ్రూప్‌–2 విజేతలుగా అక్క, చెల్లెలు

నందికొట్కూరు: గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టుకు అక్క, గ్రూప్‌–2లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు చెల్లెలు ఎంపికయ్యారు. మిడుతూరు మండలం జలకనూర్‌ గ్రామానికి చెందిన తొగట ఎల్ల చంద్రుడు, స్వర్ణలలిత దంపతులకు చెందిన ఇద్దరు కుమార్తెలు విజేతలుగా నిలిచారు. పెద్ద కుమార్తె తొగట ప్రియాంక రెండు సార్లు గ్రూప్‌–1 రాసినా విజయం సాధించలేదు. మూడో సారి రాసి విజయం సాధించారు. చిన్న కుమార్తె తొగట సాహితీ గ్రూప్‌–2 మొదటి సారి రాసి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలో గ్రూప్‌–1, గ్రూప్‌–2లో విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దండ్రి తొగట ఎల్ల చంద్రుడు వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. తల్లి స్వర్ణలలిత గుంటూరు గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో ఐసీటీసీ కౌన్సెలర్‌గా పని చేసి మూడు నెలల క్రితం నందికొట్కూరు గవర్నమెంట్‌ ఆసుపత్రికి బదిలీపై వచ్చారు.

తొగట ప్రియాంక, తొగట సాహితీ

గ్రూప్‌–1, గ్రూప్‌–2 విజేతలుగా అక్క, చెల్లెలు1
1/1

గ్రూప్‌–1, గ్రూప్‌–2 విజేతలుగా అక్క, చెల్లెలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement