● తప్పుడు కేసులకు భయపడొద్దు ● రైతుల హక్కులను తాకట్టు పె
కార్యకర్తలను కంటికి
రెప్పలా కాపాడుకుంటాం
‘తప్పుడు కేసులు, నిర్బంధాలకు ఏ ఒక్క కార్యకర్త భయపడొద్దు.. రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఎం కన్వెన్షన్ హాల్‌లో డోన్ నియోజకవర్గస్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించడం మానుకోకపోతే టీడీపీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సీఎం చంద్రబాబు ..తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని నిలుపుదల చేయడం దుర్మార్గమని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ రైతుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు.
అప్పుడు వద్దని.. ఇప్పుడు సర్వేనా..?
భూ యాజమాన్య హక్కు రైతులకు కల్పించేందుకు నాడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భూ రీసర్వే చేయగా, నానా యాగి చేసి అప్రతిష్టపాలు చేసిన చంద్రబాబునాయుడు నేడు అదే సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాల్లో మార్పులు ఏమి చేయలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అది కూడా తప్పుల తడకగా ఉందని రైతులకు గుర్తుచేశారు.


