దిగుబడి తగ్గే అవకాశం
ఈ ఏడాది రబీ సీజన్‌లో నాకున్న సొంత పొలంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో పూలేజి(తెల్ల)రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. ఎకరాకు రూ. 25 వేలు వెచ్చించాను. ఎండు తెగులు ఆశించడంతో దిగుబడులు తగ్గే ఆస్కారముంది. మరో పది రోజుల్లో కోత, నూర్పిడి పనులకు సిద్ధమవుతున్నాను.
– లక్ష్మీనారాయణ, రైతు, కలుగొట్ల,
కోవెలకుంట్ల మండలం
ఐదెకరాల సొంత పొలంలో శనగ పంట సాగు చేయ గా తుపాన్ కారణంగా పైరు దెబ్బతినడంతో కొంతమేర తొలగించాను. పైరు దెబ్బతిన్న స్థానంలో తిరిగి విత్తనం వేశాను. ముందస్తుగా సాగు చేసి దెబ్బతినని పైరులో ఇటీవల కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా ఐదు ఎకరాలకు సంబంధించి 15 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. మిగిలిన పైరు కోత దశలో ఉంది.
– వెంకటేశ్వర్లు, రైతు, జోళదరాశి,
కోవెలకుంట్ల మండలం
దిగుబడి తగ్గే అవకాశం


