టాయ్‌లెట్లలో నీళ్లు రాకపోతే ఎలా?
● మహానంది గిరిజన ఆశ్రమపాఠశాల సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
మహానంది: విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లలో బకెట్లు లేవు.. మగ్గులు లేవు.. నీళ్లు రావడం లేదు.. ఇంత నిర్లక్ష్యమా.. అంటూ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల పాఠశాలలో చదువుతున్న తొమ్మిదవ తరగతి విద్యార్థి విజయ్‌కుమార్ తీవ్రంగా గాయపడి కర్నూలులో చికి త్స పొందుతూ కోలుకోలేక మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా విద్యాబోధన, వసతి సౌకర్యాలు, సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు పనిచేయక పోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. మరుగుదొడ్లను స్వయంగా పరిశీలించిన ఆమె నీళ్లు రాకపోడం గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. నీళ్లు రాకపోతే విద్యార్థులు ఎలా వినియోగిస్తారంటూ ఆగ్రహించారు. దీనిపై ఇన్‌చార్జ్ వార్డెన్ హరికృష్ణ.. ట్యాంకులో నీళ్లు అయిపోయినట్లున్నాయ్.. మేడం అనగా అలా ఎలా.. మాట్లాడతారంటూ మండిపడ్డారు. విద్యార్థులు చేతు లు, కాళ్లు శుభ్రం చేసుకునే కుళాయి ట్యాంకు వద్ద పాచిపట్టడంతో కలెక్టర్ వెంట వచ్చిన సిబ్బంది జారిపడబోయాడు. గమనించిన కలెక్టర్.. ఇలా ఉంటే విద్యార్థులె లా ఉండాలని నిలదీశారు. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయురాలు నాగమ్మ కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను విన్నించారు.


