● ధాన్యం సంచుల కింద పడి ఒకరు మృతి ● ఆరుగురికి తీవ్ర గాయ
మొక్కజొన్నల లారీ బోల్తా
జూపాడుబంగ్లా: అతివేగానికి ఓ ప్రాణం బలైంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో కర్నూలు – ఆత్మకూరు జాతీయ రహదారిపై శుక్రవారం తంగడంచ క్రాస్‌రోడ్డు వద్ద మొక్కజొన్నల బస్తాల లోడ్‌తో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. తూడిచెర్ల గ్రామానికి చెందిన దొంతుల నరసింహులు గ్రామంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఐచర్ వాహనంలో నందికొట్కూరు సమీపంలోని గోదాముకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహ నం డ్రైవర్ షేక్‌బాషాతో పాటు బస్తాలను గోదాములో దింపేందుకు గ్రామానికి చెందిన హమాలీలు భరత్, యుగంధర్, శివరాజు, వెంకటేశ్వర్లు, నారాయణ, వెంకటరమణ, పుల్లయ్య వాహనంలో బయలుదేరారు. కాగా తంగడంచ క్రాస్‌రోడ్డు వద్ద డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసే క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉంచిన డ్రమ్ములను ఢీకొన్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంపైన ఉన్న వారిపై బస్తాలు పడటంతో భరత్(32)కు తీవ్రగాయాలై అక్కక్కడికే మృతిచెందాడు. వాహనం డ్రైవర్ షేక్‌బాషా పరారీ అయ్యా డు. క్షతగాత్రులను 108లో నందికొట్కూ రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భరత్ మృతిచెందిన విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు శ్రీనివాసులు, రమణమ్మ, భార్య కళ్యాణి సంఘటనా ప్రాంతానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
● ధాన్యం సంచుల కింద పడి ఒకరు మృతి ● ఆరుగురికి తీవ్ర గాయ


