రుణం తిరిగి చెల్లించేంత వరకు విఖ్యాత్ డీ ఫాల్టరే
విఖ్యాత్ రెడ్డి డెయిరీకి డీ ఫాల్టర్‌గా ఉన్న విషయాన్ని మరువ వద్దు. అప్పటి డెయిరీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి నుంచి జగత్ డెయిరీ పాల నాణ్యత చూపి రూ.1.20 కోట్లు రుణం తీసుకొని జగత్ విఖ్యాత్‌రెడ్డి డీ ఫాల్టర్ అయ్యాడు. రుణం తిరిగి చెల్లించేంత వరకు డైరెక్టర్ కాలేడు. 25 ఏళ్లు చైర్మన్‌గా మీ కుటుంబానికి చెందిన వ్యక్తులే పదవిలో ఉన్నారు. ప్రభుత్వం పోలీసుల చేతుల్లో ఉండటంతో నాపై మూడు కేసులు నమోదు చేయించారు. డెయిరీలో అవినీతి జరిగితే ఏ విచారణకు అయినా సిద్ధం. నాలుగున్నరేళ్లలో రూ.45కోట్లు డెయిరీకి ఆదాయాన్ని ఇచ్చాను. పాడిరైతులు, ఉద్యోగులకు డెయిరీ ఏర్పాటు నుంచి తొలిసారిగా బోనస్ అందజేశాం. డెయిరీకి అభివృద్ధికి కృషి చేయాలే తప్ప కుటిల రాజకీయం చేయవద్దు. – ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి,
విజయ డెయిరీ చైర్మన్, నంద్యాల


