అమ్ముకోలేం.. దాచుకోలేం
పది ఎకరాల సొంత పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలు తీసుకుని 5 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల్లో వరి సాగు చేశా. మొక్కజొన్న కోత సమయంలో వర్షానికి తడిచిపోవడంతో క్వింటా రూ.1,200 చొప్పున అమ్ముకోవడంతో రూ. లక్ష నష్టం వచ్చింది. వరి పరిస్థితి ఇలాగే ఉంది. దళారులు బస్తా రూ.1,200, రూ.1,400గా ధర నిర్ణయించడంతో అమ్ముకోలేక, దాచుకోలేక ఇబ్బందులు పడుతున్నాం.
– మహబూబ్ సాహెబ్, చాగలమర్రి
నేను 8 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. పంట కోసిన సమయంలో వర్షం రావడంతో మొక్కజొన్నలు తడవటంతో రూ.1500కే అమ్ముకోవాల్సి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో క్వింటాకు రూ. 900 తక్కువకు అమ్ముకోవడం జరిగింది. ఈ లెక్కన సుమారు 240 క్వింటాళ్లకు రూ 2 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి
ఉంటే ఈ నష్టం ఉండేది కాదు.
– రామకృష్ణ, రుద్రవరం, పాములపాడు మండలం
●
అమ్ముకోలేం.. దాచుకోలేం


