సత్తా చాటిన ప్రభుత్వవైద్య కళాశాల విద్యార్థులు
గోస్పాడు: నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు సెకండియర్ ఫలితాల్లో సత్తా చాటారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ తెలిపారు. మంగళవారం విద్యార్థుల అభినందన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2023కు బ్యాచ్ సెకండియర్ విద్యార్థులు 98.6 శాతం, 2024కు సంబంధించిన ఫస్ట్ ఇయర్ బ్యాచ్ విద్యార్థులు 95.3 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో ఫస్ట్ ఇయర్‌లో 6 మంది డిస్టింక్షన్, 73 మంది ఫస్ట్ క్లాస్, 64 మంది సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండియర్‌లో 12 మంది డిస్టింక్షన్, 78 మంది ఫస్ట్ క్లాస్, 52 మంది సెకండ్ క్లాస్ ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు, పలు విభాగాల అధిపతులు, డాక్టర్లు పాల్గొన్నారు.
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. మంగళవారం పట్టణంలోని సైబ్ జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ.. సబ్‌జైల్‌లో నెలకొన్న సమస్యలను న్యాయవాదుల దృష్టికి, ఆన్‌లైన్ 1500 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదే విధంగా జైళ్లలోని ఖైదీల సంఖ్య, కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది బాలు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దేవస్థానం
గృహ నిర్మాణాల పరిశీలన
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానం సిబ్బంది కోసం సున్నిపెంటలో నిర్మిస్తున్న గృహ సముదాయాలను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా కలెక్టర్ రాజకుమారి శ్రీశైలం మండలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీశైలంలో నివసిస్తున్న దేవస్థాన సిబ్బందిని త్వరలో సున్నిపెంటలో నిర్మిస్తున్న గృహాలకు తరలించి, అక్కడి దేవస్థానం స్థలాలలో ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గతంలో సున్నిపెంటలోని జలవనరుల శాఖకు చెందిన స్థలాలలో రెండు 3 స్టార్ హోటళ్లు, నగర వనం, అమ్యూజ్‌మెంట్ పార్కులు, రెస్టారెంట్ల నిర్మాణాల కోసం కేటాయించిన స్థలాలను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ కె.వి.శ్రీనివాసులు ఉన్నారు.
యాగంటీశ్వరుడికి రూ.2.45 లక్షల ఆదాయం
బనగానపల్లె: మండలంలోని యాగంటి ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం తలనీలాల వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఈ నెల 13వ తేదీ నుంచి 2026 నవంబర్ 12 వరకు తలనీలాలు పోగు చేసుకునే హక్కు లభిస్తుంది. చాగలమర్రి గ్రామానికి చెందిన కోటపాడు నాగేంద్ర రూ.2.45 లక్షలకు హక్కు దక్కించుకున్నారు. ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు బ్రహ్మనందరెడ్డి, యాగంటిపల్లి మౌలీశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సత్తా చాటిన ప్రభుత్వవైద్య కళాశాల విద్యార్థులు
సత్తా చాటిన ప్రభుత్వవైద్య కళాశాల విద్యార్థులు
సత్తా చాటిన ప్రభుత్వవైద్య కళాశాల విద్యార్థులు


