
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
మద్దికెర: మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో మంగళవారం ముగతి వెంకటేశ్వర్లు (55)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌నాయక్ తెలిపిన వివరాలు.. రామలింగమ్మ, నాయుడుకు ఐదుగురు కూతు ళ్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు వెంకటేశ్వర్లుకు 23 ఏళ్ల క్రితం సరస్వ తిని ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఒక కూతురు వుంది. భార్య భర్తల మధ్య కొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండేవి. సరస్వతి పలుమార్లు బహిరంగంగానే భర్తపై దాడి చేసేంది. విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తులను, సర్దిచెప్పేందుకు వెళ్లిన గ్రామ పెద్దలను సైతం అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉండటంతో పట్టించుకోవడం మానేశారు. ఈక్రమంలో నాలుగైదు రోజులుగా చిత్రహింసలకు గురిచేసి ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన భర్త చనిపోయాడని బంధువులకు ఫోన్ చేసి తెలపడంతో వారు అక్కడికి వెళ్లి చూడగా బోర్లాపడి అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కాగా తన కుమారుడి మృతి పట్ల కోడలు సరస్వతిపై అనుమానం ఉందని మృతుని తల్లి రామలింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.