
యూరియా పంపిణీలో ఉద్రిక్తత
కొత్తపల్లి: వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో పలు చోట్ల యూరియా పంపిణీలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేయాల్సి వచ్చింది. సోమవారం మండలంలోని గువ్వలకుంట్ల, కొత్తపల్లి, కొక్కెరంచ, పెద్ద గుమ్మడాపురం గ్రామ ఆర్‌ఎస్‌కేలకు ఒక్కో లారీ యూరియా లోడు చొప్పున చేరుకున్నాయి. గువ్వలకుంట్ల, కొక్కెరంచ గ్రామాల్లో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేయగా, పెద్ద గుమ్మడాపురం గ్రామంలో ఘర్షణ తలెత్తగా పంపిణీ నిలిపివేశారు. గువ్వలకుంట్ల గ్రామ రైతుల పొలాలు అన్ని ఆత్మకూరు మండలం కురుకుంద పొలిమేరలో ఉన్నాయి. అయితే ఏళ్ల తరబడి రైతులు గువ్వలకుంట్ల గ్రామంలో ఎరువులు పొందుతున్నారు. వ్యవసాయ అధికారులు అవగాహన లోపంతో పొలిమేరలో పంచాయితీ పెట్టి రైతులకు మధ్య ఘర్షణలు రేకెత్తించారు. అందులో భాగంగా బండినాయిని పాలెం, గువ్వలకుంట్ల రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ సిబ్బందిని జెడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి నిలదీశారు. ఈక్రమంలో ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది, రైతులు నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. అంతకు ముందు గువ్వలకుంట్ల సచివాలయానికి వస్తున్న యూరియా లారీని వీరాపురం గ్రామ రైతులు కొంతమంది అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లారీని కొత్తపల్లి పోలీసు స్టేషన్ తరలించి అనంతరం సీఐతో పాటు గువ్వలకుంట్ల సచివాలయానికి తీసుకువచ్చారు. అక్కడ పొలం పాసుపుస్తకానికి ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు.
బ్లాక్‌లో తరలిస్తున్న ఎరువులు స్వాధీనం
నందికొట్కూరు: ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌కు బ్లాక్‌లో తరలిస్తున్న ఎరువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందికొట్కూరు పట్టణంలోని శ్రీలక్ష్మినరసింహ ఎరువుల దుకాణం నుంచి బొలెరో వాహనంలో డీఏపీ 58 బస్తాలు, ట్రాక్టర్‌లో 28.28.0 ఎరువులను తెలంగాణలోని అలంపూర్‌కు తరలిస్తునట్లు సమాచారం వచ్చిందని రూరల్ సీఐ సుబ్రమణ్యం, బ్రాహ్మణకొ ట్కూరు ఎస్‌ఐ తిరుపాలు తెలిపారు. సోమవారం బ్రాహ్మణకొట్కూరులో వాహనాలను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాక్‌లో తరలిస్తునట్లు గుర్తించారు. వాహనాలను తనిఖీ చేసి ఎరువుల ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న లింగనవాయికి చెందిన చాకలి పరశురాము డు, శ్రీలక్ష్మినరసింహ ఎరువుల దుకాణదారుడు నందకుమార్, కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామానికి వేణుగోపాల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గువ్వలకుంట్లలో పోలీసుల సమక్షంలో
యూరియా పంపిణీ
ఆత్మకూరు రూరల్ సీఐ,
కొత్తపల్లి జెడ్పీటీసీ మధ్య వాగ్వాదం
పెద్ద గుమ్మడాపురంలో
పంపిణీ నిలిపివేత

యూరియా పంపిణీలో ఉద్రిక్తత