కానిస్టేబుల్‌ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

Aug 26 2025 8:12 AM | Updated on Aug 26 2025 8:12 AM

కానిస్టేబుల్‌ అభ్యర్థుల  ధ్రువీకరణ పత్రాల పరిశీలన

కానిస్టేబుల్‌ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన

కర్నూలు: సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ పెరేడ్‌ మైదానంలో సోమవారం ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టారు. మొత్తం 309 మంది సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల్లో 297 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అభ్యర్థులు సమర్పించిన ధృవీకరణ పత్రాలన్నిటినీ సమగ్రంగా కౌంటర్ల వారీగా పరిశీలించారు. అన్ని పత్రాలను సక్రమంగా సమర్పించిన వారిని తదుపరి నియామక దశకు ఎంపిక చేస్తారని తెలిపారు.

నేడు ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పత్రాల పరిశీలన

334 మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మంగళవారం పత్రాల పరిశీలన ఉంటుంది. మొదటి రోజు హాజరు కాని సివిల్‌ కానిస్టేబుళ్లు 12 మందికి ఏపీఎస్పీ అభ్యర్థులతో పాటు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అడిషనల్‌ ఎస్పీలు హుసేన్‌ పీరా, కృష్ణమోహన్‌, డీఎస్పీ భాస్కర్‌ రావు, డీపీఓ ఏఓ విజయలక్ష్మి, ఆర్‌ఐలు, సూపరింటెండెంట్లు, డీపీఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

మైనారిటీ విద్యార్థులకు

హాస్టల్‌ ప్రవేశాలు

కర్నూలు(అర్బన్‌): నగరంలోని వేంకటాచలపతి నగర్‌లోని మైనారిటీ (బాలురు) విద్యార్థుల పోస్టు మెట్రిక్‌ ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్‌ సబీహా పర్వీన్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి 25 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ప్రవే శం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9440822219, 9848864449ను సంప్రదించాల న్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement