
అనుమతి.. అవిఘ్నమస్తు!
నిబంధనలు పాటించాలి
నంద్యాల(వ్యవసాయం): గణపతి నవరాత్రోత్సవాలు సమీపిస్తుండటంతో అంతటా సందడి మొదలైంది. ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు వాడవాడలా మండపాల నిర్వాహకులు ఆయా పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నిర్వాహక కమిటీలు భారీ వినాయక విగ్రహాలకు, లైటింగ్, డెకరేషన్, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్డర్లు ఇచ్చారు. జిల్లా పరిధిలో సుమారు 1,200కు పైగా వినాయక మండపాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా. నంద్యాలలో 500, ఆళ్లగడ్డ 120, బనగానపల్లెలో 100, కోవెలకుంట్ల 110, డోన్ 100, ఆత్మకూరు 120, నందికొట్కూరు 150కి పైగానే ఏర్పాటు కానున్నాయి. నంద్యాల పట్టణంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోనే అత్యంత ప్రతిష్టత్మకంగా వినాయక ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ సారి భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కాగా ఉత్సవాల్లో ముందస్తు జాగ్రత్తగా పోలీసు శాఖ https://ganeshutsav.net ప్రత్యేక పోర్టల్‌ను అందు బాటులోకి తెచ్చింది. వినాయక మండపాలను ఆన్ లైన్‌లో నమోదు చేయడంతో నవరాత్రుల ప్రారంభోత్సవం నుంచి శోభాయాత్ర, నిమజ్జనం వరకు తదితర అంశాలను చాలా సులువుగా చేపట్టవచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రతి విగ్రహానికి క్యూఆర్ కోడ్ ఇవ్వనుంది. పోలీస్ శాఖ అనుమతుతో పాటు పంచాయతీ, విద్యుత్, అగ్నిమాపక శాఖల అనుమతుల వివరాలు పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంటుంది.
27 నుంచి వినాయక చవితి వేడుకలు
ప్రారంభం
జిల్లాలో దాదాపు 1200 విగ్రహాలు
ఏర్పాటుకు సన్నాహాలు
మండపాలకు సింగిల్ విండో
అనుమతులు
మండపాల వద్ద డీజే సౌండ్‌లు
వినియోగిస్తే చర్యలు
ఇప్పటికే వినాయక ఉత్సవ నిర్వాహకులతో ఏరియా వారీగా సమావేశాలు ఏర్పాటు చేశాం. పోలీసు మార్గదర్శకాలు, అనుమతు లు గురించి వివరిస్తాం. వినాయక విగ్రహాల ఏర్పాటుకుగా గణేష్ ఉత్సవ్.నెట్‌లో నమోదు చేసుకోవడం ద్వారా సింగిల్ విండో అనుమతులు ఇవ్వనున్నాం. పెద్ద డీజేల ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కమిటీ సభ్యులపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమిస్తే నిర్వహణ కమిటీ సభ్యులే బాధ్యత.
– అధిరాజ్‌సింగ్ రాణా, జిల్లా ఎస్పీ, నంద్యాల

అనుమతి.. అవిఘ్నమస్తు!