
బిడ్డను ఎట్లా పోషించేది..
చిత్రంలో కుమారుడు ఇర్ఫాన్‌తో ఉన్న మహిళ పేరు కరీమూన్. సొంతూరు రుద్రవరం. బెంచీపై ఉన్న తన 15 ఏళ్ల కుమారుడికి పుట్టుక నుంచి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. నడవలేడు, కూర్చోలేడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.15వేలు పింఛన్ వచ్చేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పింఛన్ దారుల వెరిఫికేషన్ అంటూ వికలత్వం శాతం తగ్గించి రూ.15 వేలు వస్తున్న పింఛన్ రూ.6వేలకు తగ్గించారు. ‘ఇన్ని రోజులు పింఛన్ వస్తుండటంతో కుమారుడిని చూపెట్టుకుంటూ ఇంటి వద్దనే ఉంటూ సేవలు చేస్తుంటిని ఇప్పుడు పరిస్థితి అర్థం కావడం లేదు. న్యాయం కోసం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని కరీమూన్ కన్నీటి పర్యంతమైంది.
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పీజీఆర్‌ఎస్‌లో 334 సమస్యలు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎండార్స్ చేశాం. సమస్యలు పదేపదే పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వినతుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.
–రాజకుమారి, జిల్లా కలెక్టర్, నంద్యాల

బిడ్డను ఎట్లా పోషించేది..