జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. మహానందిలో అత్యధికంగా 20.4మి.మీ, డోన్‌లో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో 17.2, నంద్యాల అర్బన్‌లో 15.8, రూరల్‌లో 15.6, బండిఆత్మకూరులో 15.2, రుద్రవరం 14.6, పగిడ్యాల 14.4, వెలుగోడు 14.0, గడివేముల 12.2, ఆత్మకూరు 11.2, ఆళ్లగడ్డ, గోస్పాడులలో 11.0, కొత్తపల్లి 10.8, నందికొట్కూరు, పాణ్యంలలో 9.8, జూపాడుబంగ్లా, దొర్నిపాడు 9.2, కోవెలకుంట్ల 8.4, శిరివెళ్ల 8.2, మిడుతూరు 8.0, పాములపాడు 6.4, చాగలమర్రి 5.2, సంజామల 4.2, కొలిమిగుండ్ల, అవుకులలో 3.6, బనగానపల్లె 3.4, ఉయ్యాలవాడ 3.0, బేతంచెర్ల 2.2 మి.మీ వర్షం కురిసింది.


