
పేకాట ఆడాలంటే అనంతపురం, కడప, కర్నూలు పేకాట రాయుళ్లు ఏడా
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఇలాఖాలో విచ్చలవిడి పేకాట
● కోవెలకుంట్లలోని
ఆరు ప్రాంతాల్లో శిబిరాలు
● బనగానపల్లిలో మంత్రి పీఏ సమీప
బంధువు ఆధ్వర్యంలో నిర్వహణ
● సంజామల మండలం
మెట్ల కొత్తూరులో రూ.4–5లక్షలతో
పేకాట శిబిరం
● కడప, అనంతపురం, నంద్యాల,
కర్నూలు జిల్లాల నుంచి
పేకాటరాయుళ్లు
● ఇప్పటివరకు పేకాటకు పెట్టింది పేరు
రాయచూరు
● ఇప్పుడు బనగానపల్లి వైపునకు
అధిక శాతం ఆటగాళ్లు
● రూ.లక్ష నుంచి రూ.2లక్షల
బ్యాంక్ ఆటలు
అన్ని చోట్లా హేస్టేక్స్ శిబిరాలే..
పేకాట స్మాల్ స్టేక్(చిన్న బ్యాంకులు), హైస్టేక్(పెద్ద బ్యాంకులు) రెండు రకాలుగా జరుగుతుంది. స్మాల్‌స్టేక్‌లో రూ.10వేల నుంచి రూ.30వేల వరకూ ఆడతారు. హైస్టేక్‌లో రూ.50వేలు, రూ.లక్ష, రూ.2లక్షలు చొప్పున మూడు రకాల బ్యాంకులు ఆడతారు. కోవెలకుంట్ల, బనగానపల్లిలో జరిగే పేకాట మొత్తం హైస్టేక్స్ ఆడుతున్నారు. ఇక్కడ రూ.లక్ష, 50వేల బ్యాంకు ఎక్కువగా ఆడుతున్నారు. స్టేక్(బ్యాంకు) ఏదైనా ఒక్కో బ్యాంకుకు 250 పాయింట్లు ఇస్తారు. పేకాట నిర్వాహకుడు డబ్బులు ఇస్తే వారికి 250 పాయింట్ల లెక్కన కాయిన్లు ఇస్తారు. పేకాట శిబిరం వద్ద డబ్బుకట్టలు ఉండవు. శిబిరానికి వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన ఒక కారు వద్దకు వెళ్లి డబ్బులు ఇస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్లు ఇస్తారు. అయితే స్టేక్‌ను బట్టి పాయింట్ల విలువ మారుతుంది. రూ.50వేల బ్యాంకు అయితే ఒక్కో పాయింట్ విలువ రూ.200, రూ.లక్షకు రూ.400, రూ. 2లక్షలకు రూ.800గా ఉంటుంది. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటోంది.
● ఒక్కో గేమ్ 10మంది ఆడతారు. కొన్ని సందర్భాల్లో 7గురు ఉంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్లు ఇవ్వాలి.
● రూ.50వేలు బ్యాంకు ఆడేవారు 8 పాయింట్లు, రూ.లక్ష బ్యాంకు ఆడితే 6, రూ.2లక్షలు ఆడితే 5 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన రూ.50వేల బ్యాంకు ఒక ఆటకు నిర్వాహకుడికి రూ.1,600, రూ.లక్ష బ్యాంకు ఆటకు రూ.2,400, హైస్టేక్ అయిన రూ.2లక్షల బ్యాంకు ఆటకు రూ.4,800 చొప్పున వస్తుంది. ఒక శిబిరంలో రోజూ కనీసం వంద ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన రూ.50వేలు బ్యాంకు రోజుకు రూ.1.60లక్షలు, రూ.లక్ష బ్యాంకు ఆడితే రూ.14.40లక్షలు(వంద ఆటలు ఆడితే), రూ.2లక్షల బ్యాంక్ ఆడిస్తే రోజుకు రూ.24లక్షలు( వంద ఆడితే) నిర్వాహకుడికి ఆదాయం వస్తుంది. సగటున ఒక్కో శిబిరంలో రోజూ రూ.10–15లక్షల ఆదాయం నిర్వాహకులకే ఉంటోంది.
సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్, మట్టి తదితర సహజ వనరులతో పాటు ఆదాయం ఉన్న ఏ మార్గాన్నీ ఆ పార్టీ నేతలు వదలని పరిస్థితి. వీటి ద్వారా ఇప్పటికే వీరు భారీగా ఆర్జిస్తున్నారు. ఇప్పుడు అత్యంత సులువుగా, భారీగా ఆదాయం వచ్చే ‘పేకాట’ను ఎంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పేకాటరాయుళ్ల నోళ్లలో నానుతున్న పేర్లు బనగానపల్లె, కోవెలకుంట్ల. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 10 శిబిరాల్లో పేకాట సాగుతోంది. మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అనుచరుల కనుసన్నల్లోనే ఈ శిబిరాలు కొనసాగుతున్నట్లు అక్కడి రాజకీయనేతలతో పాటు అధికారులకు తెలియంది కాదు. అయినా ఏ ఒక్క అధికారి, పోలీసులు అరికట్టే సాహసం చేయడం లేదంటే నిర్వాహకులకు మంత్రి బీసీ ఆశీస్సులు ఉండటమేనని తెలుస్తోంది.
గ్రామస్తుల తిరుగుబాటుతో
మకాం మార్పు
మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సొంత గ్రామం గుమ్మనూరులో గతంలో నిర్వహించిన పేకాట శిబిరాలను ఆదర్శంగా తీసుకుని సంజామల మండలం మెట్లకొత్తూరులో ఓ టీడీపీ నేత రూ.4–5లక్షలతో షెడ్డు నిర్మించాడు. ఇందులో పేకాట ఆడించారు. అయితే గ్రామస్తుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ‘మహిళలు ఈ రోడ్డుపై తిరుగుతుంటారు. వేరే ఊర్ల నుంచి భారీగా కార్లు వస్తున్నాయి. ఇది పద్ధతి కాదు. మరొకచోట ఆడుకోండి..’ అని గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఆ శిబిరాన్ని తాత్కాలికంగా మూసేశారు. రోజూ ఒకచోట పేకాట ఆడిస్తూ, అడ్రస్ గూగుల్ మ్యాప్‌లో షేర్ చేస్తున్నారు.
రాయచూరు నుంచి బనగానపల్లి వైపు..
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రిక్రియేషన్ క్లబ్‌లలో పేకాట కొనసాగింది. గత ప్రభుత్వంలో క్లబ్‌లు పూర్తిగా నిషేధించారు. దీంతో చిత్తూరు మినహా రాయలసీమ జిల్లాల పేకాటరాయుళ్లు రాయచూరు క్లబ్‌కు వెళ్లేవాళ్లు. రాయచూర్‌లో ఇప్పటికీ పేకాట నడుస్తోంది. తెల్లవార్లూ గ్యాంబ్లింగ్ ఆడుతారు. అయితే బనగానపల్లిలో టీడీపీ నేతలు పేకాట నడపడం మొదలయ్యాక ప్రొద్దుటూరు, కడప, తాడిపత్రి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, మహబూబ్‌నగర్, గద్వాల నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు. తెలంగాణ వాసులు కొద్దిరోజులు రాయచూర్, కొన్ని రోజులు బనగానపల్లికి వస్తున్నారు. తక్కిన ‘సీమ’ ప్రాంతాల నుంచి బనగానపల్లికి రోజూ ఒక్కో శిబిరానికి 15–20కి పైగా కార్లలో వస్తుండటం గమనార్హం.
పేకాట రాయుళ్లకు కల్పించే
సదుపాయాలు ఇవీ..
శిబిరం నిర్వాహకుడికి పాయింట్లు ఇచ్చినందుకు పేకాట ఆడేందుకు సూదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాటు చేస్తారు. రూ.2లక్షల బ్యాంకు ఆడే వారికి డబుల్‌బ్లాక్, గ్లెన్‌లివెట్ లాంటి విదేశీమందు ఇస్తారు. సుదూరప్రాంతాల నుంచి వచ్చే వారికి విమాన టిక్కెట్‌లు బుక్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువమందిని పేకాటకు తీసుకొచ్చే వారికి నెలకు రూ.లక్ష–2లక్షలు గిఫ్ట్‌గా ఇస్తారు. ఈ స్థాయిలో బయటి వ్యక్తులు రోజూ వచ్చిపోతూ మద్యం సేవిస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో స్థానికుల గౌరవం, రోజు వారీ జీవనం ఎలా ప్రభావితం అవుతుందో ఇట్టే తెలుస్తోంది.
కోవెలకుంట్లలో పేకాట శిబిరాలు ఎక్కడెక్కడంటే..
జమ్మలమడుగు రోడ్డులోని
ఓ ఫంక్షన్‌హాలు పక్కన వెంకటేశ్వరస్వామి
ఆలయం సమీపంలోని
ఓ ఇండిపెండెంట్ ఇల్లు.
సంతపేటలోని ఓ ఇల్లు.
ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ఎస్టీకాలనీలో.
చాకలి తిమ్మయ్య ఇంటి
సమీపంలోని ఇల్లు.
బస్టాండ్ రోడ్డులో ఓ స్కూలు ఎదురుగా
ఉన్న ఇల్లు.
మార్కెట్‌యార్డులోని ప్రభుత్వ
అతిథి గృహం.
బనగానపల్లెలో ఇలా..
కరెంట్ ఆఫీసు సమీపంలో మంత్రి బీసీ
జనార్దన్‌రెడ్డి పీఏ సమీప బంధువులు
పేకాట ఆడిస్తున్నట్లు తెలుస్తోంది.
బత్తలూరుపాడుకు చెందిన ఓ టీడీపీ నేత
బనగానపల్లెలో ఉంటూ పేకాట శిబిరం
నిర్వహిస్తున్నాడు.
అవుకు మండలం రామాపురంలో
ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో
పేకాట సాగుతోంది.

పేకాట ఆడాలంటే అనంతపురం, కడప, కర్నూలు పేకాట రాయుళ్లు ఏడా

పేకాట ఆడాలంటే అనంతపురం, కడప, కర్నూలు పేకాట రాయుళ్లు ఏడా

పేకాట ఆడాలంటే అనంతపురం, కడప, కర్నూలు పేకాట రాయుళ్లు ఏడా