
ఇవీ దారుణాలు..
● నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడటమే కాకుండా శుత్రవులపై పగ తీర్చుకునేందుకు సైతం ఉపయోగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
● కొంత కాలం క్రితం అహోబిలంలో భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నాటు తుపాకీ గాయాలతో మృతి చెందారు.
● గత కొంత కాలం క్రితం వివాహేతర సంబంధం అనుమానంతో వేటకోసం అని రామాంజనేయులు అనే వ్యక్తి నరసింహులను అడవిలోకి తీసుకుపోయి నాటుతుపాకీతో కాల్చగా గురి తప్పి పెద్దన్న అనే వ్యక్తికి తగలడంతో తీవ్రంగ గాయపడ్డ సంఘటన సంచలనం లేపింది.
● గత మూడు రోజుల క్రితం ఐదుగురు వేటగాళ్లు రెండు దుప్పులను వేటాడి వాటి చర్మాలు తీసి దాచి పెట్టి తలలు కాల్చి వండుకుని తిని, మాసం ఓ టీడీపీ నేత దుకాణంలో కవర్లలో ప్యాక్ చేస్తు తుపాకులతో సహా దొరికిపోయారు.
స్థానికంగానే తయారీ..
అవసరమైన ట్రిగ్గర్, బ్యారెల్, గార్డ్, వాలా కమ్మీలు వేలూరు నుంచి తెచ్చుకుని స్థానికంగానే నాటు తుపాకులు తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. పేర్నంబట్ , గుడియత్తంలో నల్లమందు, గుండ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. వేటగాళ్ల నాటుతుపాకుల కారణంగా ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నా పోలీస్, అటవీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రూ. 10వేలు ఇస్తే నాటు తుపాకీ దొరుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.