
అవసరమైన ప్రాంతాలకు యూరియా
నంద్యాల: జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో యూరియా నిల్వలను వినియోగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనవసరంగా యూరియా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా ప్రచారం చేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌లో భాగంగా నమోదైన బంగారు కుటుంబాలకు త్వరితగతిన మార్గదర్శులను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు. పెండింగ్ ఉన్న నీడ్ అసెస్మెంట్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. డీఆర్‌ఓ రామునాయక్, సీపీఓ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ లలిత, అదనపు మున్సిపల్ కమిషనర్ దాసు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి