
శ్రీశైలంలో 184 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 879.30 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 184.2774 టిఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి 31,222 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 1,10,749 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 70,124 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వార 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,225 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 10.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.253 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.844 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
అలగనూరు గేట్లు బంద్
పాములపాడు: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లు బంద్ చేశామని ఏఈ శ్రీనివాసనాయక్ గురువారం విలేకరులకు తెలిపారు. లాకీన్స్‌లా నుంచి నిప్పుల వాగుకు 200, తూడిచెర్ల సబ్‌చానల్‌కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సుంకేసుల నుంచి కేసీ కెనాల్‌కు 2,200క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు.
పసుపు కొమ్ములతో మాలలు
మహానంది: శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారికి రేపు (శ్రావణ మాసం మూడో శుక్రవారం) సుమారు 250 కిలోల పసుపు కొమ్ములతో మాలలు అలంకరించనున్నారు. అందులో భాగంగా పసుపు కొమ్ములతో మాలలను సిద్ధం చేస్తున్నారు. ఇలా అలంకరించిన అమ్మవారిని దర్శించడం ద్వారా భక్తులకు శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు.
ఏఎన్‌ఎం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(హాస్పిటల్): ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఎంపీహెచ్‌ఏ(ఏఎన్‌ఎం) కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ వై. జయమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు మీడియంలో నిర్వహించే ఈ కోర్సు వ్యవఽ ది రెండు సంవత్సరాలు కాగా.. ఇంటర్, వొకేషనల్, వన్‌స్టింగ్ ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నా రు. మొత్తం 40 సీట్లు ఉన్నాయని, 17 సంవత్సరాలు దాటిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. దరఖాస్తున్ను రీజనల్ సెంటర్ లేదా cfw.in వెబ్‌సైట్ నుంచి తీసుకుని సెప్టెంబర్ 30వ తేదిలోగా సమర్పించాలన్నారు. అక్టోబ ర్ 15న ఎంపిక జాబితా ప్రచురిస్తామని, అదే నెల 21 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణలో ఉన్నప్పుడు నెలవారీ స్టైఫండ్ రూ.2వేలు మొదటి సంవత్సరం, రూ.2,500 రెండవ సంవత్సరం ఇస్తారని పేర్కొన్నారు.
జిల్లా టూరిజం శాఖ అఽధికారిగా లక్ష్మీనారాయణ
కర్నూలు కల్చరల్: జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) కర్నూలు డివిజినల్ మేనేజర్ జి.లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. డీటీఓగా విధులు నిర్వహిస్తున్న విజయ ఆమె సొంత శాఖ ఐసీడీఎస్‌కు పీడీగా వెళ్లడంతో ఆ స్థానంలో లక్ష్మినారాయణకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అఽథారిటీ(ఏపీటీఏ) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు.