
వేద భూమి.. నేటి నుంచి ఉత్సవ దీప్తి
మంత్రాలయం: వేద భూమి అయిన మంత్రాలయంలో శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ఉత్సవ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంత్రాలయం పుర వీధులు విద్యుద్దీపాలతో వెలుగుగొందుతున్నాయి. శ్రీమఠం కారిడార్, ప్రాకారాలు, వసతి నిలయాలు దీపకాంతుల తేజస్సుతో విరాజిల్లుతున్నాయి. మఠం ప్రాకారాలు విరుల పరిమళాలు వెదజల్లుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణతో ఆరాధనకు అంకురార్పణ పలకనున్నారు. లక్ష్మీపూజ, ధాన్యపూజ, గజ, అశ్వ, గోపూజలు అశేష భక్తజనవాహిని మధ్య జరగనున్నాయి. శుక్రవారం రాత్రి ఊంజల మంటపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, ఛామర్ల సేవలు ఉంటాయి.

వేద భూమి.. నేటి నుంచి ఉత్సవ దీప్తి