
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు (టౌన్) : సమ్మర్ కోచింగ్ క్యాంపులను ప్రతి విద్యార్థి, విద్యార్థినీ వినియోగించుకొవాలని జిల్లా క్రీడల అబివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఆదివారం స్థానిక వీకర్ సెక్షన్ కాలనీలోని సుందరయ్య పార్కు అవరణలో తైక్వాండో సమ్మర్ కోచింగ్ క్యాంపును డీఎస్‌డీవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సెలవులను వృథా చేయకుండా సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులు పాల్గొనాలన్నారు. క్రీడలతో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. తైక్వాండో కోచ్ షబ్బీర్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వివరాల కోసల 6302555345 సెల్ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.
జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి
భూపతిరావు