మహిళా కాంగ్రెస్‌ కమిటీలో ముగ్గురికి చోటు | - | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌ కమిటీలో ముగ్గురికి చోటు

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

నల్లగొండ : తెలంగాణ ప్రదేశ్‌ మహిళా కాంగ్రెస్‌ నూతన కమిటీలో నల్లగొండ జిల్లాకు మూడు కీలక పదవులు దక్కాయి. మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలిగా గోపగాని మాధవిని మరోసారి నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమెకు మూడోసారి జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. 2019లో తొలిసారిగా ఈ పదవిని చేపట్టిన మాధవి, తాజాగా మరోసారి నియామకమయ్యారు. మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కమిటీలోనూ జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా గాజుల సుకన్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కె.నాగమణిరెడ్డి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షురాలిగా మాధవి పునర్నియామకంతో కలిపి జిల్లాకు మొత్తం మూడు పదవులు దక్కినట్లయింది. జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాట్లాడుతూ నియామకానికి సహకరించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఫ మూడోసారి జిల్లా అధ్యక్షురాలిగా గోపగాని మాధవి నియామకం

ఫ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా గాజుల సుకన్య, ప్రధాన కార్యదర్శిగా నాగమణిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement