నల్లగొండ : రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూళ్లలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు, వారి డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సయ్యద్ సలీం, శ్రీనివాస్, అనిల్ కుమార్, సత్తయ్య, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఫస్సీ అహమ్మద్, పురుషోత్తం, ఖలీల్ అహమ్మద్, ప్రదీప్, నరేంద్ర బాబు, రమేష్ పాల్గొన్నారు.


