మిల్లర్లు సిండికేట్ అయి ధర తగ్గించి ధాన్యం కొంటుండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. కష్టపడి పండించిన సన్న ధాన్యానికి మిల్లర్లు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. కొనుగోళ్లపై అధికారులు పర్యవేక్షణ పెంచి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.
– ఉపేందర్, రైతు,
తుంగతుర్తి, కేతేపల్లి మండలం
25 రోజుల క్రితం సన్న ధాన్యాన్ని క్వింటా రూ.4వేల నుంచి రూ.4,500 వరకు కొనుగోలు చేసిన మిల్లర్లు ఇప్పుడు రూ.2,900 నుంచి రూ.3,200కు ధర తగ్గించడం అన్యాయం. క్వింటా ధాన్యానికి కనీసం రూ.4,500 అయినా చెల్లించి ఆదుకోవాలి.
– పాండు, రైతు, రంగ్యాతండా,
దామరచర్ల మండలం


