నల్లగొండ టూటౌన్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గెలుపొంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలకాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని పట్టభద్రుల చేత ఓటరు నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, నిరంజన్ వలి, మందడి సైదిరెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, కార్పొరేటర్లు భవాని గణేష్, యాదయ్య, మల్లీశ్వరి అశోక్, రత్నగిరి తారకమ్మ శ్రీనివాస్, దీపికా ప్రవీణ్‌రెడ్డి, బాణావత్ దీప్లా, దొడ్డి రమేష్, స్వాతి రాజశేఖర్, శ్రీనివాస్‌రెడ్డి, జమాల్ ఖాద్రి, బొజ్జ వెంకటయ్య, లక్ష్మి, జయప్రదరెడ్డి పాల్గొన్నారు.


