యాసంగి సాగుకు విత్తన కొరత | - | Sakshi
Sakshi News home page

యాసంగి సాగుకు విత్తన కొరత

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

వరిసాగుకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌..

ఫ మార్కెట్లో లభించని స్వల్పకాలిక వరి విత్తనాలు

ఫ ఆరుతడి విత్తనాలు సైతం అందుబాటులో ఉంచని ప్రభుత్వం

నల్లగొండ అగ్రికల్చర్‌ : యాసంగి సీజన్‌ సాగుకు విత్తన కొరత రైతులను వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయొద్దని హెచ్చరిస్తున్నప్పటికీ రైతులు చాలావరకు యాసంగిలో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. అయితే తక్కువ కాలంలో చేతికొచ్చే (110 రోజులకు) వరి రకాలను సాగు చేసుకోవాలని చూస్తున్నారు. కానీ మార్కెట్లో స్వల్పకాలిక వ్యవధిలో చేతికొచ్చే వరి విత్తనాలు అందుబాటులో లేకుండా పోయాయి. వీటితోపాటు ఆరుతడి పంటల విత్తనాలు కూడా లభ్యం కావడం లేదు.

ఉత్పత్తి తగ్గించిన విత్తన కంపెనీలు..

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే వరి సాగు చేయవద్దు అని సూచించిన నేపథ్యంలో ప్రైవేట్‌ విత్తన కంపెనీలు వరి విత్తనాల ఉత్పత్తిని తగ్గించాయి. దీంతో రైతులకు స్వల్పకాలిక వ్యవధి విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొంది. కేవలం దొడ్డు రకం విత్తనాలు, 140, 150 రోజుల వ్యవధిలో కోతకొచ్చే వరి విత్తనాలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రైతులు మాత్రం స్వల్ప కాలిక వ్యవధిలో చేతికొచ్చే వారి విత్తనాలే కావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సబ్సిడీపై అందని ఆరుతడి విత్తనాలు..

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు ఆరుతడి పంటల వైపు పోవాలనుకున్న ఆరుతడి పంటలు విత్తనాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచలేదు. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో బోరుబావుల కింద సుమారు మూడు లక్షల ఎకరాల వరకు వరిసాగు అయ్యే అవకాశం ఉందని అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై ఆరుతడి పంటల విత్తనాలను రైతులకు అందిస్తే మరో లక్ష ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగయ్యే అవకాశం ఉంటుంది. కూరగాయల సాగు కూడా మరో పదివేల ఎకరాల్లో సాగు చేసుకునే అవకాశం ఉంటుందని అనధికారంగా తెలుస్తోంది.

వరిసాగు చేస్తే విద్యుత్‌ కొరతతో పాటు సాగునీటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వం చెబుతోంది. సాగు చేసిన రైతులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తేనే విత్తనాలు అమ్మాలని ప్రభుత్వం వ్యాపారులకు సూచించింది. వరి ఎండిపోతే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పూర్తిగా తమదే బాధ్యత అంటూ వ్యవసాయ విస్తరణ అధికారులకు కూడా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement