రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

చండూరు : నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. సోమవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో ఎండిన పంటలను వారు పరిశీలించి మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలం సరిగ్గా వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి.. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు వల్ల కౌలు రైతులు అధికంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య, మాజీ జెడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, భిక్షమయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, పల్లె శంకర్‌, బండమీది వెంకన్న, సంజీవ, బోయపల్లి వెంకటేశం, కాటపల్లి శ్రీను, ఇరిగి ముత్తయ్య, సాయి, పరమేష్‌, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement