పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

Nov 3 2026 2:27 AM | Updated on Nov 3 2026 2:27 AM

నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 34 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్‌ అధికారులు వాటిని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఫోన్‌ద్వారా ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ శాఖ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో పోలీస్‌ గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

పదవీ విరమణ సభలో రాజకీయాలు సరికాదు

నల్లగొండ : ఉద్యోగి పదవీ విరమణ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని టీఎన్జీవో జిల్లా మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకుడు ఏడుదొడ్ల వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, మూడు డీఏలు, జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్‌ లీవ్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టారని విమర్శించారు. పదవీ విరమణ కార్యక్రమాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చకుండా ఉద్యోగుల గౌరవాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ సహాధ్యక్షుడు మామిడాల రమేష్‌ పాల్గొన్నారు.

సాంకేతిక నైపుణ్యాలతో బోధన మెరుగు

నల్లగొండ టూటౌన్‌ : అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో అధ్యాపకుల బోధన మెరుగుపడుతుందని ఎంజీయూ రిజిస్ట్రార్‌ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో అధ్యాపకులకు బోధన, సాంకేతిక నైపుణ్యాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులకు పైతాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌, ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌, కృత్రిమ మేధా, సాప్‌ టెక్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో జయంతి, రేఖ, సుధారాణి, సాంబశివరావు, సాయికృష్ణ, విజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement