స్కైవాక్‌.. మల్టీప్లెక్స్‌ | - | Sakshi
Sakshi News home page

స్కైవాక్‌.. మల్టీప్లెక్స్‌

Nov 1 2026 7:19 AM | Updated on Nov 1 2026 7:19 AM

స్కైవాక్‌తో ప్రత్యేక ఆకర్షణ

ఫ క్లాక్‌ టవర్‌.. నయా లుక్‌ ఫ రూ.197.44 కోట్లతో నీలగిరి గడియారం సెంటర్‌ సుందరీకరణ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే క్లాక్‌ టవర్‌ సెంటర్‌ రూపురేఖలు మారనున్నాయి. నగర అభివృద్ధిలో భాగంగా క్లాక్‌ టవర్‌ కూడలిని సుందరీకరించేందుకు రూ.197.44 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో క్లాక్‌ టవర్‌ సెంటర్‌ను సరికొత్త ఆకర్షణగా తీర్చిదిద్దడంతో పాటు పాత ఆర్‌అండ్‌బీ కార్యాలయ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, మల్టీప్లెక్స్‌ నిర్మించనున్నారు. వీటితోపాటు సీ లేదా యూ ఆకారంలో స్కైవాక్‌ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయి. వచ్చే వారం వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

స్మార్ట్‌ సిటీలో భాగంగా

నీలగిరి స్మార్ట్‌ సిటీలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రూ.138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.59.23 కోట్లు కేటాయించాయి. మొత్తం రూ.197.44 కోట్లతో క్లాక్‌ టవర్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ బుర్రి చైతన్య తన ఛాంబర్‌లో సుందరీకరణ ప్రాజెక్టు నమూనా, లోగోను డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ అష్రఫ్‌ అలీ అమేర్‌, కార్పొరేటర్లతో కలిసి ఆవిష్కరించారు.

నగర అభివృద్ధికి మరింత ఊతం

సుందరీకరణ పూర్తయితే క్లాక్‌ టవర్‌ సెంటర్‌ నగరంలో మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇప్పటికే నగరంలో రూ.20 కోట్లతో పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి, రూ.20 కోట్లతో సాగర్‌ రోడ్డులో వైఎస్సార్‌ విగ్రహం నుంచి చర్లగౌరారం రోడ్డు వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ, రూ.100 కోట్లతో సయ్యద్‌ లతీఫుల్లా ఖాద్రి గుట్ట, బ్రహ్మంగారి గుట్టలకు ఘాట్‌ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే నగరం పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుంది.

క్లాక్‌ టవర్‌ సెంటర్‌ అభివృద్ధిలో భాగంగా స్కైవాక్‌ ఏర్పాటు చేయడం ప్రాజెక్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సీ లేదా యూ ఆకారంలో నిర్మించే ఈ స్కైవాక్‌ ద్వారా ప్రజలకు సరికొత్త అనుభూతి కలగనుంది. అలాగే పాత ఆర్‌అండ్‌బీ కార్యాలయ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, మల్టీప్లెక్స్‌ నిర్మాణంతో నగర ప్రజలకు షాపింగ్‌, వినోద సౌకర్యాలు ఒకేచోట అందుబాటులోకి రానున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో స్థానిక వ్యాపారులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

ఫ ఆర్‌అండ్‌బీ కార్యాలయ స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం

ఫ నగర ప్రజలకు ఒకేచోట షాపింగ్‌, వినోదం

ఫ ప్రపంచ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు

ఫ పాలనా అనుమతులు జారీ.. వారంలో టెండర్ల ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement