19.8 మిమీ వర్షపాతం నమోదు
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 19.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చిట్యాల మండలంలో 70.8 మి.మీ, నార్కట్‌పల్లి మండలంలో 70.0, దామరచర్ల 55.2. మిర్యాలగూడ 55.0, త్రిపురారం 49.3, కట్టంగూర్ 31.3, శాలిగౌరారం 48.1, నకిరేకల్ 21.7, కేతేపల్లి 17.7, నల్లగొండ 13.2, కనగల్ 18.1, మునుగోడు 23.6, చండూరు 15.9, గుర్రంపోడు 32.1, నిడమనూరు 12.1, మాడ్గులపల్లి 18.1, వేములపల్లి 28.6, అడవిదేవులపల్లి 15.6, తిరుమలగిరిసాగర్ 16.9, పెద్దవూర మండలంలో 18.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
నల్లగొండ అగ్రికల్చర్ : తుఫాన్ కారణంగా జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు రైతులను దెబ్బతీశాయి. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. మిర్యాలగూడ, దామరచర్ల, త్రిపురారం, తిరుమలగిరిసాగర్ మండలాల్లో వరి చేలు దెబ్బతిన్నాయి. చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్ తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి పోయింది. కొన్ని చోట్ల మిర్చి, ఇతర మెట్ట పంటలకు ఈ వర్షం జీవం పోసింది.


