చారిత్రక ఆలయానికి సొబగులు | - | Sakshi
Sakshi News home page

చారిత్రక ఆలయానికి సొబగులు

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు

నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని చారిత్రక పానగల్లు ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదలన మేరకు ఈ నిధులు మంజూరయ్యాయి. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు, సమీపంలోని జల వనరులను సమగ్రంగా అభివృద్ధి చేసి సుందరీకరించేందుకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 19న జీఓఆర్టీ నంబర్‌ 311ను విడుదల చేసింది. పానగల్లును ప్రముఖ వారసత్వ, ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిధులను కేటాయించింది. తెలంగాణ పర్యాటక అబివృద్ది సంస్థ (టీజీటీడీసీ) ఇంజినీరింగ్‌ విభాగం రూపొందించిన అంచనాల మేరకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. తదుపరి చర్యలను పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చేపట్టనున్నారు.

పర్యాటక కేంద్రంగా పానగల్లు..

పానగల్లులోని ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర ఆలయాలు చారిత్రక ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రాంతంలోని వారసత్వ సంపదను పరిరక్షించడంతోపాటు పర్యాటకులను ఆకర్షించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ పరిసరాల సుందరీకరణ, సమీపంలోని జలవనరుల అభివృద్ధి ద్వారా పానగల్లుకు పర్యాటకంగా మరింత గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తయితే భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఫ పానగల్లు ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు

ఫ మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదనలతో నిధులు మంజూరు

ఫ ఆలయం, పరిసరాల సమగ్ర

సుందరీకరణకు దోహదం

ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షనీయం. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలయాల పరిరక్షణతోపాటు పరిసరాల సుందరీకరణ, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయి. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పానగల్లును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది.

– బుర్రి చైతన్య, నల్లగొండ మేయర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement