బైపాస్‌లో రెండు అండర్‌పాస్‌లు | - | Sakshi
Sakshi News home page

బైపాస్‌లో రెండు అండర్‌పాస్‌లు

Oct 24 2026 11:07 AM | Updated on Oct 24 2026 11:07 AM

మిర్యాలగూడ : మిర్యాలగూడలోని అద్దంకి– నార్కట్‌పల్లి బైపాస్‌ రోడ్డుపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు చెక్‌ పడనుంది. పట్టణ పరిధిలోని నందిపాడు జంక్షన్‌, చింతపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద అండర్‌పాస్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.37.95 కోట్లు మంజూరు చేసింది. శుక్రవారం రవాణా, రోడ్ల భవనాల శాఖ ప్రత్యేకాధికారి వికాస్‌రాజ్‌ జీఓ ఆర్టీ నంబర్‌ 545 ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదేళ్లలో 25పైగా ప్రమాదాలు

మిర్యాలగూడలోని అద్దంకి– నార్కట్‌పల్లి బైపాస్‌పై ఫ్‌లైఓవర్ల నిర్మాణానికి గతంలోనే శంకుస్థాపనలు చేసినా.. పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై మిర్యాలగూడ పట్టణ పరిధిలోని ఏడుకోట్లతండా, నందిపాడు, రవీంద్రనగర్‌, చింతపల్లి, ఈదులగూడెం జంక్షన్లు బ్లాక్‌స్పాట్లుగా ఉన్నాయి. ఈ ఐదు ప్రదేశాల్లో గడిచిన రెండేళ్ల కాలంలో సుమారు 25కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోగా ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి.

అండర్‌పాస్‌తో ప్రమాదాలకు అడ్డుకట్ట

వరుస ప్రమాదాలు, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ చీప్‌ ఇంజనీర్‌ ద్వారా తాజాగా నందిపాడు, చింతపల్లి జంక్షన్‌ వద్ద వాహనాల అండర్‌పాస్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. నూతనంగా నిర్మించే ఈ అండర్‌పాస్‌తో పాటు ఇరువైపులా సర్వీస్‌ రోడ్లను నిర్మిస్తే నిత్యం జరిగే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రజాసమస్యలకు పరిష్కారంగా ఈ ఉత్తర్వులు వెలువడడంతో నియోజకవర్గ ప్రజలు, ప్రయాణీకులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఫ రూ.37.95కోట్లు విడుదల చేస్తూ జీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement