తిప్పర్తి : మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తూ శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు తీర్మానించారు. అనంతరం సర్పంచ్ ఉట్కూరి వాణి సందీప్‌రెడ్డితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బెల్టు షాపులను పూర్తిగా బంద్ చేసేలా తీర్మానించారు.
కొత్తపేటలో..
కేతేపల్లి: మండలంలోని కొత్తపేట గ్రామంలో ఈ నెల 9 నుంచి మద్య నిషేధాన్ని అమలు చేస్తూ శుక్రవారం గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం అమ్మేవారికి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు పంపిస్తామని, తీర్మానాన్ని ఉల్లఘిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని, సమాచారం అందించిన వారికి రూ.50వేలు బహుమతి అందిస్తామని సర్పంచ్ చింత విజయకృపాకర్ తెలిపారు. తీర్మానం ప్రతులను పోలీసులు, ఎకై ్సజ్ అంధికారులకు అందించారు. సమావేశంలో ఉపసర్పంచ్ నారగోని సంధ్యఉపేందర్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


