ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

రామగిరి(నల్లగొండ) : భూగర్భ జలాలు తగ్గుతున్న తరుణంలో రైతులు తమ ప్రాంతంలోని నీటి లభ్యతను బట్టి వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)ఉల్లోజు వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని రంగారెడ్డినగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని, రాబోయే రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరం వరి సాగు అయ్యే నీటితో సుమారు నాలుగు ఎకరాల్లో ఆరుతడి పంటలను పండించవచ్చని తెలిపారు. రైతులు మినుములు, అలసందలు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ వంటి లాభదాయక పంటలను ఎంచుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. యంత్రాల వినియోగంతో ప్రయోజనాలు, వ్యవసాయ శాఖ సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఓ శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

రాచకాల్వ గండి పూడ్చివేత

శాలిగౌరారం : శాలిగౌరారం ప్రాజెక్టులోకి మూసీనది నుంచి వరదనీరు వచ్చే రాచకాల్వకు పడిన గండిని నీటిపారుదలశాఖ అధికారులు పూడ్చివేయించారు. శుక్రవారం పల్లివాడ హెడ్‌ రెగ్యూలేటర్‌ నుంచి రాచకాల్వకు వరదనీటిని మళ్లించారు. రాచకాల్వకు పడిని గండిని పూడ్చి న ప్రదేశాన్ని నీటిపారుదలశాఖ ఈఈ సత్యనా రాయణ, ఏఈ విక్రమ్‌ పర్యవేక్షించారు. వారి వెంట పనుల నిర్వాహకులు చామల వెంకటరమణారెడ్డి, ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఉన్నారు.

సోలార్‌ ప్లాంట్లకు బ్యాంకు రుణాలు

నల్లగొండ : సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునే ప్రతి గృహ విద్యుత్‌ వినియోగదారుడికి జాతీయ బ్యాంకులు రుణాలు సమకూరుస్తున్నాయని డీఈ (ఆపరేషన్స్‌) విద్యాసాగర్‌ తెలిపారు. సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు, బ్యాంకుల ద్వారా అందించే రుణ సదుపాయాలు, సోలార్‌ పవర్‌ వెండర్ల వివరాలను గృహ విద్యుత్‌ వినియోగదారులకు వివరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ ఎం.వినోద్‌రెడ్డి, ఏడీఈలు వేణుగోపాలాచార్యులు, శ్రీను, ఏఈలు హరికృష్ణ, ఫీల్డ్‌ ఆఫీసర్‌ అశోక్‌, వేణు, విద్యుత్‌ వినియోగదారులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీల రెఫరీగా గణేష్‌

గట్టుప్పల్‌ : ఛత్తీస్‌ఘడ్‌ రాష్టం బిలాయిలో ఈ నెల రెండు నుంచి ఏడో తేదీ వరకు జరిగే జాతీయస్థాయి 45వ సబ్‌ జూనియర్స్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు రెఫరీగా గట్టుప్పల్‌కు చెందిన ఎరుకల గణేష్‌ ఎంపికై నట్లు బాల్‌ బ్యాండింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీవీ రమణ, రాష్ట్ర చీఫ్‌ రిఫరీ ఆర్‌.వెంకటరామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్‌ ఎంపికపై అసోసియేషన్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. టి.శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి. ఎ. బయ్యన్న, సంయుక్త కార్యదర్శి పి.జంగయ్య హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement