ఆడపడుచులకు.. చిలుకపచ్చ కోక | - | Sakshi
Sakshi News home page

ఆడపడుచులకు.. చిలుకపచ్చ కోక

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

నల్లగొండ : బతుకమ్మ పండుగకు మహిళలు చిలుక పచ్చరంగులో మెరిసిపోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఏటా అందించే చీరలు ఈ సారి చిలుకపచ్చ రంగులో వచ్చేశాయి. పండుగ మరో 20 రోజులు ఉండగానే ముందస్తుగా జిల్లాకు చీరలు వచ్చాయి. మొత్తం 4 లక్షల చీరలు రావాల్సి ఉండగా.. ఇప్పటికే 2 లక్షల చీరలు వచ్చాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మిగతా చీరలు త్వరలోనే రానున్నాయని అధికారులు చెబుతున్నారు. సద్దుల బతుకమ్మకు రెండ్రోజుల ముందుగానే పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

పండుగ కానుక

గత ప్రభుత్వ హయాం నుంచి మహిళలకు ఉచితంగా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు ఆడపడుచులకు పండుగ కానుకగా చీరలను ఇవ్వాలని అప్పట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో రేషన్‌ కార్డులో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఈ చీరలను అందించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి పంపిణీ చేస్తూ వస్తోంది.

పాలపిట్ట రంగు నుంచి..

పథకాన్ని ప్రారంభించిన సమయంలో వివిధ రకాల డిజైన్లలో మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. గతేడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఒకే విధమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించి.. పాలపిట్ట రంగు చీరలను అందించారు. ఈసారి అందరికీ చిలుకపచ్చ రంగు చీరలు అందించాలని డిజైన్‌ చేయించింది. సెప్టెంబర్‌ చివరి నాటికి చీరలను సరఫరా చేసి పండుగకు రెండు, మూడు రోజుల ముందు పంపిణీ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఫ బతుకమ్మ పండుగకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

ఫ జిల్లాకు చేరిన 2 లక్షల చీరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement