పంటల నమోదు పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పంటల నమోదు పారదర్శకంగా నిర్వహించాలి

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌

కేతేపల్లి: వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల నమోదు (డిజిటల్‌ క్రాప్‌ సర్వే) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌ సిబ్బందికి సూచించారు. శుక్రవారం కేతేపల్లి మండలంలోని ఉప్పలపహాడ్‌ గ్రామంలో నిర్వహిస్తున్న పంటల సాగు నమోదు ప్రక్రియను ఆయన పరీశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. పంటల సర్వే ప్రక్రియలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఉన్నతాధికారుల ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. వానాకాలంలో ప్రభుత్వం సూచించిన సన్న రకాలు సాగు చేసిన రైతులు రూ.500 బోనస్‌ పొందేందుకు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌ చేయించుకోవాలని తెలిపారు. డీఏఓ వెంట కేతేపల్లి ఏఓ పురుషోత్తం, ఏఈఓ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, డీసీఎస్‌ వలంటీర్‌ శ్రీను తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement