ఉత్తమ టీచర్ల ఎంపికకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ టీచర్ల ఎంపికకు కసరత్తు

Aug 29 2026 2:10 AM | Updated on Aug 29 2026 2:10 AM

30 వరకు గడువు

నల్లగొండ : ఈ ఏడాది జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నారు. ప్రతి మండలం నుంచి అన్ని కేటగిరీలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు చొప్పున ఉపాధ్యాయుల నామినేషన్లు పంపించాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేసింది.

సీనియర్లకు ప్రాధాన్యం..

ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కనీసం 15 సంవత్సరాల బోధనా అనుభవం ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులకు ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అయితే కేవలం సీనియారిటీ కాకుండా అన్ని విభాగాల్లో వారి సేవలను పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారు ఈ ఎంపికకు అర్హులు కాదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

మూడేళ్లలో చేసిన సేవలకు..

2023–24, 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో వన మహోత్సవం కార్యక్రమంతోపాటు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సెమినార్లలో పేపర్‌ ప్రజెంటేషన్లు చేయడం, ముఖ్యమైన పరిశోధనలు చేపట్టడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు అకాడమీ, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణలకు రచయితలు, ఎడిటర్లుగా, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రిసోర్స్‌ పర్సన్‌లుగా సేవలందించిన వారి ప్రతిభను కూడా పరిశీలించనున్నారు.

ముగ్గురు సభ్యులతో కమిటీ

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు మండల స్థాయిలో తహసీల్దార్‌ చైర్మన్‌గా, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి సభ్యుడిగా, మండల విద్యాధికారి మెంబర్‌ కన్వీనర్‌గా ముగ్గురితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇద్దరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి డీఈఓకు ప్రతిపాదనలు పంపనుంది. ఎంపికై న అభ్యర్థులు తమపై ఎలాంటి ఆరోపణలు, కోర్టు కేసులు లేవని, ఇంతవరకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందలేదని డిక్లరేషన్‌ సమర్పించాలి.

టీచర్ల నుంచి ఇప్పటికే ఈ నెల 26 తేదీ వరకు ప్రతిపాదనలు స్వీకరించారు. మండల స్థాయి సెలక్షన్‌ ప్రక్రియను ఈ నెల 27న పూర్తిచేశారు. అన్ని స్కూళ్లలోని ఉపాధ్యాయులతో ఎంపికై న పేర్ల జాబితాను ఈ నెల 30లోగా జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించాల్సి ఉంది.

ఫ 15 ఏళ్ల బోధనా అనుభవానికి ప్రాధాన్యం

ఫ ప్రతిభ, ఫలితాలు, వినూత్న కార్యక్రమాలే ప్రామాణికం

ఫ ప్రతి మండలం నుంచి ఇద్దరి చొప్పున నామినేషన్లు

ఫ ఈనెల 30లోగా జాబితా సమర్పణకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement