ట్రాఫిక్ నియంత్రణపై శ్రద్ధ చూపాలి
చిట్యాల, నార్కట్‌పల్లి : సంక్రాంతి పండుగ నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్– విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్‌శాఖ శ్రద్ధ చూపాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, చిట్యాల పట్టణంలో హైవేపై నిర్మిస్తున్న ఫ్రై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను, రైల్వే అండర్ బ్రిడ్జి కింద గల హైవే రోడ్డును, నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ బైపాస్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ సందర్భంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. రోడ్డుపై అవసరమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళల్లో హైవే రోడ్డుపై లైటింగ్, ప్రమాదకర హెచ్చరిక బోర్డులను, రిప్లెక్టివ్ సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్‌పీ కె.శివరాంరెడ్డి, సీఐ నాగరాజు, ఎస్‌ఐలు రవికుమార్, క్రాంతికుమార్, చిట్యాల మున్సిపల్ కమిషన్ శ్రీను, హైవే అధికారులు ఉన్నారు.
గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ 42 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


