పత్తి మిల్లు వద్ద రైతుల ఆందోళన
చండూరు : స్లాట్ బుక్ చేసుకున్నా.. పత్తిని కొనుగోలు చేయడం లేదని చండూరు మండలంలోని బంగారిగడ్డ మంజీత్ పత్తి మిల్లు వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. స్లాట్‌బుక్ చేసుకున్న దానికి, ట్రాక్టర్‌లో తెచ్చిన పత్తికి వ్యత్యాసం ఉండటంతో కొనుగోలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్లాట్ బుకింగ్ ఉండి పత్తి ఎక్కువ తెచ్చినా కొనుగోలు చేసేవారని.. ఇప్పుడు సీసీఐ కేంద్రం నిర్వాహకులు దళారులతో కుమ్మకై ్క రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు సీసీఐ కేంద్రం అధికారి బాలచందర్ నింజేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను ఉంచి ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాక్టర్లను మిల్లులోకి పంపారు. కానీ కొనుగోలుపై సీసీఐ అధికారులు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.


