మహోన్నత కవి గింజల నర్సింహారెడ్డి
నకిరేకల్ : తెలంగాణ గర్వించదగ్గ మహోన్నత కవి గింజల నర్సింహారెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అన్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన గింజల నర్సింహారెడ్డి సాహిత్య సమాలోచన కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా బాలాచారి మాట్లాడుతూ గింజల నర్సింహారెడ్డి సాహిత్యంలోని గాఢత, అభివృద్ధికి, అలంకారీక సౌందర్యం నేటి తరం కవులు అలవర్చుకోవాలన్నారు. కవి, చరిత్రకారులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచేపోయే కవిత్వాలను గింజల నర్సింహారెడ్డి రాశారని గుర్తు చేశారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బెల్లి యాదయ్య, ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బండారు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ముసుగు కృష్ణారెడ్డి, అంబటి వెంకన్న, కందాల పాపిరెడ్డి, కవులు జిలకర జమదగ్ని, బరిగల శ్రవణ్, షీలా అవిలేను, మెంతబోయిన సైదులు, మామిడి లింగస్వామి, సంగభట్ల నర్సయ్య, ఎం.జానకిరాం, బైరెడ్డి కృష్ణారెడ్డి, కోల్లోజు కనకాచారి, చిక్కు చంద్రమౌళి, కందుల సోమయ్య, కుకడాల గోవర్ధన్, సాగర్ల సత్తయ్య, సారంగి వెంకన్న, తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.


