జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. క్రిస్మస్‌తో పాటు వారాంతపు సెలవులు ముగియడంతో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారు రాజధానికి తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అదనంగా రెండు లైన్లు కేటాయించారు. అయినప్పటికీ వాహనాలు భారీ సంఖ్యలో వస్తుండటంతో టోల్‌ప్లాజా దాటేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.


