ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29, 30తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 సాయంత్రం 5 గంటలకు మంగళవాయిద్యం, వేదమంత్రపఠనం, శాసీ్త్రయ సంగీత కచేరీతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రాత్రి 8 గంటలకు భక్త రామదాసు హరికథ, లక్ష్మీనృసింహనామ ససంకీర్తనం నిర్వహించనున్నారు. 30వ తేదీ తెల్లవారుజామున స్వామివారి వైకుంఠ(ఉత్తర) ద్వార దర్శనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయంలో లక్షారేపత్రి పూజ, గ్రామోత్సవం, స్వామి వారి ఆలయ ప్రవేశం, రాత్రి 8 గంటలకు మట్టపల్లి క్షేత్ర మహత్యం బుర్రకథ ఉంటుందని కమిటీ ఆలయ చైర్మన్ చెన్నూరు మట్టపల్లిరావు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, ప్రసాదాలు, దైవదర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


