మంత్రులే లేఖలు రాయడం బాధాకరం
కృష్ణా నదిలోని
నీటి నమూనాల సేకరణ
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కృష్ణా నదిలోని నీటి నమూనాలను మంగళవారం కేంద్ర అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్‌ఈ నాగభూషణ్ మాట్లాడుతూ.. కృష్ణా నదిలో వ్యర్థ రసాయనాలు కలిసి రంగు మారిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపాలని సూచించారని, ఈ మేరకు సెంట్రల్ పొల్యూషన్, ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు, నీటి పరిశోధనశాఖ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సెంటర్‌కు చెందిన బృందాలు మట్టపల్లికి చేరుకుని నీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. శాసీ్త్రయ నిర్ధారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ రామ్‌కిషోర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈఈ ఫయాజ్ తదితరులున్నారు.
ఫ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
యాదగిరిగుట్ట : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా కాంగ్రెస్ మంత్రులే 40 టీఎంసీలు చాలు అని లేఖలు రాయడం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం కొండపైన హరిత టూరిజం హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీటి ప్రాజెక్టులు తీసుకువస్తే.. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తగ్గించి, రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిందన్నారు. యాదగిరి దేవస్థానం నుంచి ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు పెట్టవద్దని నోటీసులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ ఇష్టానుసారంగా జెండాలు, ఫ్లెక్సీలు పెట్టి నిబంధనలను ఉల్లంఘించారన్నారు. ప్లెక్సీలు ఏర్పాటును వ్యతిరేకించి నిరసన తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు అక్రమంగా తీసుకెళ్లారన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలకు ప్రేమ పెరిగిందని, అందుకే సర్పంచ్‌లుగా అధిక సీట్లు గెలిపించారన్నారు. కేసీఆర్ అద్భుతమైన పాలనతో పరిపాలన చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఈ ఫొటోలోని రైతు నిడమనూరు మండలం వేంపాడు శివారులోని కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి కోటయ్య. ఆయన తనకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాలకు పైగా భూమిలో బత్తాయి, మిగతా భూమిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.3.5 లక్షలతో రాతి స్తంభాలతో పందిరి ఏర్పాటు చేసుకుని బీర, దొండ, కాకర వంటి తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నాడు. వారానికి ఒకసారి మిర్యాలగూడ, నల్లగొండ మార్కెట్‌కు కూరగాయలు తరలిస్తున్నారు.
నిడమనూరు : ఇతర పంటలతో పోలిస్తే రైతులకు పందిరి సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. మార్కెట్‌కు అనుగుణంగా గ్రామీణ యువత పందిరి సాగుపై దృష్టి సారిస్తున్నారు. నిడమనూరు మండలంలోని నాన్ ఆయకట్టు గ్రామాల్లో ఒకప్పుడు బత్తాయి, కంది, పెసర, మినుము వంటి సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. బత్తాయి సాగులో ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకంతో ఫలసాయం కంటే తోట పోషణ రైతుకు ఆర్థిక భారంగా మారింది. దీంతో కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించి, వాటిపై వచ్చిన ఆదాయాన్ని బత్తాయి తోటకు పెట్టుబడిగా పెడుతున్నారు. బత్తాయిపై వచ్చిన ఆదాయాన్ని రైతు స్థిరమైన వార్షిక ఆదాయంగా చెప్పకుంటున్నారు. తీగ జాతి కూరగాయల సాగుతో రైతులు వారానికి మార్కెట్, రవాణా ఖర్చులు పోను సగటున రూ.25వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. తీగ జాతి పంటల సస్యరక్షణ చర్యలకు ఎరువులు, పురుగు మందల వాడానికి నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంతేగాకుండా బీర, కాకర తీగ పంటకాలం ముగిసేలోపు టమాట కూడా అంతరంగా ముందుగానే వేస్తున్నారు. దీంతో సగటున రైతులు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.
పందిరి సాగుతో స్థిరమైన ఆదాయం
ఫ 20 గుంటల్లో కాకర సాగు చేస్తూ.. వారానికి 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడితో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం రైతు కోటయ్య చెబుతున్నాడు.
ఫ అదేవిధంగా అర ఎకరంలో దొండ సాగుతో వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, వారానికి రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఫ 10 గుంటల భూమిలోనే (5 నుంచి 8 వరుసలు) బీర సాగు చేశానని, వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, క్వింటాల్‌కు రూ.3 వేల వరకు లభిస్తోందని కోటయ్య చెబుతున్నారు.
మంత్రులే లేఖలు రాయడం బాధాకరం
మంత్రులే లేఖలు రాయడం బాధాకరం
మంత్రులే లేఖలు రాయడం బాధాకరం


